నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోమనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం మార్చిలో విడుదల కానున్నట్లు సమాచారం. నాని తర్వాతి చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈమూవీకి టక్ జగదీశ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈమూవీలో నాని ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
తాజాగా ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. జులై 3న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. కాగా నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్ను కోరి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈమూవీ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నాడు. ఈమూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.