ఎన్నికల్లో పోటీ చేయనున్న నాని?

53
- Advertisement -

నేచురల్ స్టార్ నాని రాజకీయాల్లోకి వస్తారా? కంగారు పడకండి. నాని నెక్స్ట్ సినిమా దసరాలో కీలకమైన ఎన్నికల సీక్వెన్స్ ఉండనుంది. గోదావరిఖని గనుల నేపథ్యంలో కథలో ఎన్నికలు జరగనున్నాయి. రంగస్థలం పాట తరహాలో ఓ ఎన్నికల ప్రచారం సాంగ్ ఒకటి సినిమాలో ఉంటుందని సమాచారం.

నాని ఫస్ట్ టైం ఊర మాస్ అవతార్ లో కనిపించనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30, 2023న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గురువారం శ్రీరామనవమి సెలవు దినం కావడంతో నాని తొలి పాన్ ఇండియా మూవీ దసరాను ఈ డేట్ కి లాక్ చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దసరా విడుదల కానుంది. దసరా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంది.

ఇది నాని కి ఇప్పటి వరకూ చూడని కొత్త తరహా కథ మరియు నాని ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

క్రేజీ మాజీ కాంబో.. నిజమేనా ?

BB6..ఫినాలే మళ్లీ అర్జునే టార్గెట్

రోహిత్‌కి కన్నీళ్లు పెట్టించిన నిఖిల్.

- Advertisement -