డయాబెటిస్ కు అద్బుతమైన ఔషధం!

68
- Advertisement -

నేటి రోజుల్లో డయాబెటిస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ షుగర్ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమింస్తుంది. ఈ వ్యాధి వచ్చిందంటే నచ్చిన ఆహారం తినడానికి వీలు పడదు. ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ డయబెటిస్ ఉన్నవారికి శరీరంపైన గాయాలు అంతా త్వరగా మానవు. ఏదైనా వ్యాధి సోకిన నయం కావడం చాలా కష్టం. కొందరిలో ఈ డయబెటిస్ కరణంగా చూపు మందగించడం, పక్షవాతానికి గురికావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి..

ఇలా ఒక్క డయాబెటిస్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ షుగర్ రాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ షుగర్ వ్యాధిని నియంత్రించడంలో సరైన మెడిసన్, ఆహార నియమాలతో పాటు మన వంటింట్లో దొరికే పదార్థాలు కూడా చక్కటి పనితీరును కనబరుస్తాయి. మెంతులు, కరివేపాకు, అల్లం, దార్చిన చెక్క వంటివి షుగర్ వ్యాధిని నియంత్రించడానికి అద్భుతంగా పని చేస్తాయి. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ తో పాటు కీళ్ల నొప్పులు, మలబద్దకం, మూత్రశాయ సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించవచ్చు.

Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

కరివేపాకు కూడా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇక అల్లంలో ఉండే ఔషధ గుణాల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరియు దాల్చిన చెక్కలో ఇన్సులిన్ ను మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందువల్ల వీటిని ఒక పానీయంలో చేసుకొని ప్రతిరోజూ తాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముందుగా రెండు గ్లాస్ ల మంచి నీరు తీసుకొని వేడి చేసి ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసి మరింత వేడి చేయాలి. ఆ తరువాత అందులో రెండు రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తరువాత ఈ నీటిలో కచ్చ పచ్చిగా దంచిన అల్లం ముక్క, ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా కలిపి.. మరొక్కసారి వేడి చేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడూ, ఉదయాన్నే పడగడుపున తాగాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంతే కాకుండా డయాబెటిస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 Also Read:ఆదిపురుష్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లాక్

- Advertisement -