ఢిల్లీలో జరిగిన జాతీయ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుల మహాసభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.మోడీ సర్కార్.. ఆధునిక భారతదేశపు వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారిని ఆపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది – అందరం ఐక్యంగా నిలబడటం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిలబడితే, అప్పుడు మోదీ జీ తప్పకుండా వెనక్కి తగ్గుతారు అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడుతూ.. కొత్త చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను పునరుద్ధరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై మీ తరఫున మేము గట్టిగా పోరాడుతామని హామీ ఇస్తున్నాం అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మహాసభలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి సంబంధించిన సమస్యలు, కార్మికుల హక్కులు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నాయకులు స్పష్టమైన వైఖరిని ప్రకటించారు.
ALso Read:మేడారం..హెలికాప్టర్ రైడ్స్ షురూ

