మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ వచ్చేసింది. చిత్ర బృందం ఫస్ట్ హాఫ్ ఎడిట్‌ను లాక్ చేసి, రీ-రికార్డింగ్ పనుల కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్కు పంపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, ఈరోజు నుంచి ప్రారంభమయ్యే తాజా షూటింగ్ షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:‘స్వయంభూ’..విడుదల తేదీ వాయిదా!
ఈ సినిమాలో కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో రూపొందిస్తున్నారు. 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

