టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు..

72
ed
- Advertisement -

నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణకు పాకింది. ఈ కేసులో రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, అంజనీ కుమార్ యాదవ్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

అయితే తనకు నోటీసులు అందలేదని … తాను నేషనల్ హెరాల్డ్‌కు విరాళం ఇచ్చిన మాట నిజమేనని.. నోటీసులు అందితే తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

1938లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఏజెఎల్‌గా పిలిచే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ వార్తలను ప్రచురించేది. ఇందులో 5 వేల మంది స్వాతంత్య్ర సమర యోధులు షేర్ హోల్డర్లుగా ఉండేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ పత్రికను కాంగ్రెస్ ఉపయోగించుకుంది. 2008లో ఈ న్యూస్ పేపర్ మూతపడగా.. ఆ సంస్థ అప్పులు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేకుండా రూ.90.25 కోట్లు అప్పుగా ఇచ్చింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలను చిక్కుల్లో పడేలా చేసింది.

- Advertisement -