- Advertisement -
కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం ఇచ్చింది. కరోనా నియంత్రణకు ఉపయోగించే బారిసిటినిబ్ మాత్రలను విరాళంగా ఇచ్చింది. రూ.4.2 కోట్ల విలువగా ఈ మాత్రలు ఒక లక్ష మంది కరోనా రోగులకు అందివ్వనున్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని నాట్కో సీఈవో రాజీవ్ నన్నపనేని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నాట్కో సంస్థకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -