నటనలో పోటీ వల్ల కొంత భయపడ్డ:చరణ్‌

35
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం గుర్తించే విధంగా నటించిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌. అలాంటి వారు నిజజీవితంలో కూడా మంచి స్నేహితులు అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. అయితే తాజాగా ఇదే విషయంపై రామ్‌ చరణ్‌ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పలు అసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల స్నేహం గురించి మాట్లాడుతూ…ఎలాంటి సన్నివేశం అయినా రాజమౌళి చాలా బాగా షూటింగ్ చేయగలరు. నేనూ ఎన్టీఆర్ ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులం. కానీ కొన్ని సీన్స్‌లో నటించేటప్పడు ఎవరు బాగా చేస్తారనే దాని గురించి పోటీ ఉంటుందేమోనని నేను కొంత భయపడ్డాను. కానీ వృత్తిపరంగా మా మధ్య అలాంటి పోటి ఎప్పుడూ లేదు.

ఆర్ఆర్ఆర్‌ సినిమా సమయంలో ఎన్నో విషయాలు పంచుకున్నాం. ఒక పిక్నిక్ వెళ్లి షూటింగ్ చేసినట్టు ఉండేది. మా మధ్య పోటీ ఎప్పుడూ సమస్య కాలేదు. ఇక అభిమానుల అంచనాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి అని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. నాటునాటు పాటకు వరల్డ్‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడమే కాదు…ఈ పాటకు ఆస్కార్‌ బరిలో కూడా నిలిచింది.

ఇవి కూడా చదవండి…

రవీంద్ర కౌశిక్‌…ది బ్లాక్ టైగర్‌ బయోపిక్

ముచ్చటగా మూడోసారి గాయం…

ఫిబ్రవరి 11..రుద్రుడు ఫస్ట్‌ సింగిల్‌

- Advertisement -