రివ్యూ: నాటకం

992
Natakam movie review
- Advertisement -

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నాటకం’. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహించారు. ప్రమోషన్ కార్యక్రమాలతోనే ప్రేక్షకుల అటెన్షన్‌ను కొట్టేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ:

అవారాగా తిరిగే కుర్రాడు బాల‌ కోటేశ్వ‌ర‌రావు (ఆశీష్ గాంధీ). తిన‌డం, తిర‌గ‌డం తప్ప ఇంకేం చేయడు. పార్వతి(అషిమా నర్వాల్‌)ని చూసి ఇష్టపడతాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తుంది. సీన్ కట్ చేస్తే ఊర్లోకి ఓ దొంగల ముఠా ప్రవేశిస్తుంది. కిరాతకంగా 72 మందిని చంపేస్తుంది. దొంగల ముఠా సృష్టించిన విధ్వంసంతో కోఠి ఏం చేశాడు..?ఆ దొంగల ముఠా ఆట ఎలా కట్టించాడు అన్నదే సినిమా కథ.

Related image

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ పాటలు,కెమెరా ప‌నిత‌నం. అచ్చమైన పల్లెటూరి వాతావరణం, దానికి తగ్గట్టుగా హీరో వేషభాషలు కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. తొలిసినిమానే అయినా హీరో అశీష్ గాంధీ అద్భుతంగా నటించాడు. మొర‌టోడిలా తనదైన నటనతో మెప్పించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ అనుమెహ‌తా. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అస్స‌లు
మొహ‌మాట‌ప‌డేలేదు. నటీనటులు అంతా కొత్తవారే. అంత తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ, లాజిక్ లేని స‌న్నివేశాలు. దొంగ‌ల ముఠాని ఫస్టాఫ్‌లో భ‌యంక‌రంగా చూపించి వాళ్ల‌ని క్లైమాక్స్ వ‌ర‌కూ ట‌చ్ చేయ‌లేదు. ప్రేమకథని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్ధం కాక తికమకపడ్డాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథలో బలం లేకపోయినా సన్నివేశాలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. సాయి కార్తీక్ పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతంలో తన ప్రావీణ్యం చూపించాడు. సినిమాకు హైలైట్ కెమెరామెన్. తన కెమెరా పనితనంతో సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Image result for natakam movie

తీర్పు:

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అలాంటి ప్రయత్నంతో వెండితెరమీదకు వచ్చిన సినిమా నాటకం. పాటలు,కెమెరా పనితనం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథ మైనస్ పాయింట్. అక్క‌డ‌క్క‌డా మెరిసిన కొన్ని సంభాష‌ణ‌లు, హీరో తన యాక్టింగ్‌తో మెప్పించిన మూవీ ‘నాట‌కం’.

విడుదల తేదీ:28/09/2018
రేటింగ్: 2.25/5
నటీనటులు: ఆశీష్‌ గాంధీ, అషిమా నర్వాల్
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాత: శ్రీ సాయిదీప్‌ చాట్ల, రాధికా శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి
దర్శకత్వం: కళ్యాణ్‌జీ గోగన

- Advertisement -