విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ లభ్యం.. ఫోటోలు

450
Vikram lander
- Advertisement -

విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ దొరికింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న విక్ర‌మ్ శిథిలాల‌ను నాసా గుర్తించింది. దానికి సంబంధించిన దృశ్యాల‌ను నాసా సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపితే, అది కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటంతో ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇక ఆ ప్రాంతానికి వెలుగు రావడంతో ల్యాండర్‌ను కనిపెట్టారు.

సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్‌ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది. విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది.

This arresting Nasa image, released on December 3, shows the precise spot on the Moon’s surface where Vikram,..

 

- Advertisement -