మళ్లీ వార్తల్లోకి మెగా మల్టీస్టారర్‌..!

335
vaun tej

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌,మల్టీస్టారర్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మహానటితో బయోపిక్‌ల హవా పెరిగిపోగా ఈ సినిమా హిట్‌తో మల్టీస్టారర్‌ల వైపు దృష్టిసారించారు హీరోలు. ప్రస్తుతం వెంకటేష్-చైతూ కాంబోలో వెంకీమామ వస్తుండగా తొలిసారిగా మెగా హీరో రాంచరణ్‌-నందమూరి హీరో ఎన్టీఆర్‌ కాంబోలో ఆర్ఆర్ఆర్ వస్తోంది.

ఇక తాజాగా మెగా హీరోలు కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌ శ్రీకారం చుట్టనున్నారట. గతంలో బన్నీ-రాంచరణ్ కలిసి ఎవరు సినిమాలో నటించగా ఇప్పుడు సాయిధరమ్ తేజ్-వరుణ్ తేజ్‌లు కలిసి మల్టీస్టారర్‌ ప్లాన్ చేసినట్లు టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సాయిధరమ్ మారుతి,సుబ్బు దర్శకత్వంలో సినిమాలు చేస్తుండగా వరుణ్ తేజ్ కూడా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కనుందని సమాచారం.

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారని టాక్. మొత్తంగా మెగా హీరోల మల్టీస్టారర్ త్వరలో రాబోతుందన్న వార్త ఫ్యాన్స్‌కు కిక్‌ ఇస్తోంది.

Varun Tej and Sai Dharam Tej for multistarrer….Varun Tej and Sai Dharam Tej for multistarrer