గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పెద్దబొడ్డేపల్లి గ్రామంలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురిని నామినేట్ చేశారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రోజాకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణపైన ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, భాగస్వాములై మొక్కలు నాటాలి. మానవాళికి పరోక్షంగా, ప్రత్యేక్షంగా ఉపయోగపడే పక్షులు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో గూడుకట్టుకుని ఉండేవి ఇప్పుడు వాటికి చెట్లు లేకపోవడం వల్ల పక్షులకు నివాసయోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు.
అందుకే మన వంతుగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మన గ్రామాల్లో కానీ వీలున్నంతగా పండ్ల మొక్కలు జనాలకు ఉపయోగపడే చెట్లను నాటి వాటిని కాపాడాలన్నారు. ఈ కార్యకమాన్ని ఆంద్రప్రదేశ్‌లో ఉదృతంగా ముందుకు తీసుకెళ్తూ, మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్న రోజాని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.