ఆయుష్మాన్‌ భారత్‌కు శ్రీకారం

303
modi ayushman
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయూష్మాన్‌ భారత్‌ పథకం నిరుపేదలకు ఓ వరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భీమా ఆయూష్మాన్‌ భారత్‌ లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేసిందని అన్నారు ప్రధాని మోడీ. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని, దేశవ్యాప్తంగా 13000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారని, గరీబీ హఠావో అని నినదించిన నేతలు నిజానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.

modi-ayushman-bharat

ఈ పథకంలో చేరిన వారికి ప్రభుత్వ, లిస్టెడ్ ప్రైవేట్ దవాఖానల్లో సేవలు లభిస్తాయి. ఎస్‌ఈసీసీ వివరాల ప్రకారం గ్రామాల్లో అణగారిన వర్గాల ను డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7గా.. పట్టణాల్లో గుర్తింపు పొందిన 11 వృత్తుల కార్మికులను అర్హులుగా గుర్తించారు. పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.

- Advertisement -