రివ్యూ : నారప్ప

52
narappa

ధనుష్ హీరోగా తమిళంలో హిట్ కొట్టిన మూవీ అసురన్‌. ఈ మూవీ రిమేక్‌గా తెలుగులో వెంకటేష్‌ హీరో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్పగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. కరోనా నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా సినిమా రిలీజ్ కాగా నారప్పతో వెంకటేష్ ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం…

కథ:

అనంతపురంలోని ఓ గ్రామంలో భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురుతో జీవితం సాగిస్తుంటాడు నారప్ప (వెంకటేశ్). ఈ గ్రామ పెత్తందారు పండు స్వామి దృష్టి నారప్ప మూడు ఎకరాల పొలం మీద పడుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆ మూడు ఎకరాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఇందులో భాగంగా నారప్ప పెద్ద కొడుకు మునికన్నను (కార్తీక్ రత్నం)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత మునికన్నను చంపేసి, తల తెగ్గొడతారు. అన్నయ్య హత్యకు ప్రతీకారంగా పదహారేళ్ళ నారప్ప రెండో కొడుకు చిన్నప్ప (రాకీ) పండు స్వామిని హత్య చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది….? తనకొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి నారప్ప ఏం చేశాడు? చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేది నారప్ప కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ వెంకటేశ్ నటన, కథ, నిర్మాణ విలువలు. సింగిల్ మ్యాన్‌ షోగా వెంకటేష్ ఒక్కడే సినిమాను నడిపించాడు. తన నటనతో నారప్పగా మెప్పించాడు వెంకీ. ముగ్గురు పిల్లల తండ్రిగా ఎంతో సహజంగా ఎమోషన్స్ ను పండించారు. సుందరమ్మ పాత్రలో ఒదిగిపోయింది ప్రియమణి . కార్తీక్ రత్నం,రాజీవ్ కనకాల, నాజర్, శ్రీతేజ్, రావు రమేశ్, బ్రహ్మాజీ, ఝాన్సీ, ‘అరుంధతి’ అరవింద్, రాకీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌, తేలిపోయిన క్లైమాక్స్‌. తమిళ రీమేక్‌ని తెలుగు నేటివిటికి అనుగుణంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనే భావన కలుగుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. తమిళ సినిమా అసురన్ లోని సన్నివేశాలు, మాటలు సేమ్ టూ సేమ్ దించేశారు. జీవీ ప్రకాశ్ ఇచ్చిన మెయిన్ బీజీఎం నే ఇక్కడా వాడేశారు. మణిశర్మ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఎడిగింట్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

వెంకటేశ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రం చేసిన శ్రీకాంత్ అడ్డాల రెండోసారి ‘నారప్ప’గా వెండితెర మీద ఆవిష్కరించాడు. ఇక తన నటనతో వెంకీ సినిమాను ముందుకు నడిపించగా సెకండాఫ్ మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ఓ సారి చూసే మూవీ నారప్ప.

విడుదల తేదీ: 20/07/2021
రేటింగ్ : 2.5 / 5
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి
సంగీతం:మణిశర్మ
నిర్మాత: సురేశ్ బాబు
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల