మే 6..నారద జయంతి

98
- Advertisement -

భారతదేశ ఆధ్యాత్మికతలో నారద మునికి విశిష్ట గుర్తింపు ఉంది. ఈయన పురాణాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. విష్ణువు నామ స్మరణ నిరంతరం పఠిస్తూ ముల్లోకాలు తిరిగేవారని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు కలహప్రియుడు అనే బిరుదు కలిగిన వ్యక్తిగా వినిపిస్తారు. ఈయన మహతి అనే సంగీత వాయిద్య వీణను వాయిస్తారు. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన నారయణ నారయణ అని పలుకుతూ ఉంటారు. కాగా నేడు ఆయన జయంతి.

మే 6న ఉత్తర భారతదేశంలో ఎక్కువగా నారద జయంతిని జరుపుకుంటారు. అయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా నారద జయంతిని జరుపుకుంటారు. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో నారద ముని దేవాలయాలు కూడా ఉన్నాయి. నారద జయంతి రోజున ప్రజలు దానధర్మాలు చేస్తారు. పేదలకు బట్టలు పంపిణీ చేస్తారు.

Also Read: నేడు వర్థంతి…భారత తొలి ఆర్థిక మంత్రి చెట్టి

జయంతి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే స్నానం చేసి, నారద ముని కోసం ఒక రోజంతా ఉపవాసం ఉంటారు. విష్ణువుకు ప్రార్థనలు కూడా చేస్తారు. వారికి చందనం, తులసి ఆకులు, అగరుబత్తీలు, పూలు, స్వీట్లు సమర్పిస్తారు.

Also Read: మే6.. ఇంటర్‌నేషనల్ నో డైట్ డే

- Advertisement -