ఆ సినిమా స్టార్ హీరోని చేస్తోందట

25
- Advertisement -

నారా రోహిత్ గత కొన్నేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. అటు పర్సనల్ లైఫ్ లో సమస్యలతో సినిమా సెట్స్ లో నారా రోహిత్ కనిపించి ఏళ్లయ్యింది. మధ్యలో ఓ థ్రిల్లర్ అంటూ ఓ మూవీ ప్రకటించాడు. దానికి సంబందించిన మరో అప్ డేట్ మళ్లీ రాలేదు. అసలు నారా రోహిత్ ఇకపై సినిమాలు చెయ్యడు, అతను నిర్మాతగా మారుతున్నాడు, కాదు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే, నారా రోహిత్ పనైపోయింది అన్నవారికి దిమ్మతిరిగే సమాధానం ఇవ్వబోతున్నాడు. నారా రోహిత్ ప్రస్తుతం చేస్తున్న ప్రతినిధి 2 సినిమా అవుట్ ఫుట్ అదిరిపోయిందట.

ఈ పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ తో తన కమ్ బ్యాక్ చిత్రంగా రోహిత్ ఆసక్తిని రేకెత్తిస్తాడట. ఈ సినిమా గురించి నారా రోహిత్ తన సన్నిహితులతో చెబుతూ.. నన్ను ఈ సినిమా స్టార్ హీరోని చేస్తోంది. అలాగే నటుడిగా కూడా మరో స్థాయిలో నిలబెడుతుంది. స్టార్ హీరో అనే గుర్తింపుని ఈ సినిమా ఇవ్వబోతుంది. ఫాన్స్ విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండగలాంటి నా జీవితంలోకి సడన్ గా ఓ సైలెన్స్ వచ్చింది. నా పనైపోయింది, కెరీర్ ఖతం అన్నారు. కానీ మా పెద్దనాన్న చంద్రబాబు గారి ప్రేరణతో మళ్లీ యాక్టివ్ కాబోతున్నాను.

వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఐతే, ప్రస్తుతం నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ ఉన్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:కుమ్మక్కులు.. జిమ్మిక్కులు!

- Advertisement -