వెంకటేష్ దర్శకత్వంలో నారా రోహిత్

21
- Advertisement -

‘ప్రతినిధి 2’తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్న హీరో నారా రోహిత్ తన ల్యాండ్‌మార్క్ 20వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. #NaraRohit20 అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్.

ఈరోజు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్ అయింది. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, విజయ్ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ప్రదీష్ ఎం వర్మ కెమెరా స్విచాన్ చేయగా, ముహూర్తం షాట్‌కి గౌతమ్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. తొలి షాట్‌కి విజయ్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈరోజు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

ఈ చిత్రంలో విర్తి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు.యంగ్ అండ్ ప్రామెసింగ్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్.

Also Read:నెల రోజుల పాలన సంతృప్తా? అసంతృప్తా?

- Advertisement -