పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతీసారి ఉద్యోగాలు పెరుగుతాయి అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైజాగ్ కన్వెన్షన్ లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు లోకేష్. మన ముందు ఏఐ ఒక అవకాశంగా ఉంది…. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టాం అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుంది…. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది.. కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అన్నారు. ఏపీ వ్యక్తులు ఇండియాకే కాదు.. ప్రపంచానికి సేవలందించాలి అన్నారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలను కడప, చిత్తూరులో ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. అన్ని రంగాల్లో ఏపీని ప్రథమస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఉన్నాం.ప్రతి సంక్షోభం.. ఒక అవకాశమే. దేశంలో నాలా చట్టాన్ని రద్దు చేసిన తొలి రాష్ట్రం ఏపీనే అన్నారు.
Also Read:గణేష్ నిమజ్జనం..ట్రాఫిక్ ఆంక్షలు
ఏపీని 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధికవ్యవస్థకు చేర్చడమే లక్ష్యం…. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏసీల్లో 50 శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయి అన్నారు. ప్రకాశం జిల్లాను కంప్రెస్డ్ బయోగ్యాస్ క్యాపిటల్ గా తయారుచేస్తాం. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ క్యాపిటల్ గా తయారుచేస్తున్నాం అన్నారు. కర్నూలు జిల్లాను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి క్యాపిటల్ గా మారుస్తున్నాం అన్నారు.

