- Advertisement -
ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ జగన్ ను ప్రశ్నించారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలోని ఓం ప్రతాప్ అనే ఆటో డ్రైవర్ ప్రశ్నించినందుకు చంపేసారని, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని సింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రశ్నించినందుకు చంపేసారని లోకేష్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కూడా ప్రభుత్వ హత్యలే అని, వీటిని ఆత్మహత్యగా మార్చి కేసును క్లోజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏపీలో దేవాలయాల ధ్వంసంపై చంద్రబాబు, దేవినేని ఉమ వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని అదేస్థాయిలో ఖండిస్తున్నారు వైసీపీ నేత కొడాలి నాని. పరుష పదజాలంతో చంద్రబాబును కొడాలి నాని టార్గెట్ చేస్తుండగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
- Advertisement -