లైగర్‌ టీజర్‌ కోసం వెయిట్‌ చేయండి: విజయ్ దేవరకొండ

63
vijay devarakonda

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్‌. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా దీనిపై స్పందించారు విజయ్‌. మై లవ్స్‌.. నిన్న మీరంతా నన్ను ఎంతో ఎమోషనల్‌కి గురిచేశారు. అదీ కూడా హ్యాపీ ఎమోషనల్‌. మీ ప్రేమ నన్ను చేరింది. ఒకప్పుడు బాధపడేవాన్ని. నేను చేసిన పనిని ఎవరైనా గుర్తిస్తారా. నా సినిమాలు చూసేందుకు ప్రజలు థియేటర్లకు వస్తారా అని అనుకొని బాధపడ్డ రోజులు ఉన్నాయి. నిన్న లైజర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ని మాత్రమే విడుదల చేశాం. రాష్ర్టాల వారీగా సంబరాలు నన్నెంతో కదిలించాయి. నేను మీకో హామీ ఇస్తున్నా. టీజర్‌ కోసం వెయిట్‌ చేయండి. నేషన్‌వైడ్‌ మ్యాడ్‌నెస్‌ పక్కా.. ప్రేమతో మీ విజయ్‌ దేవరకొండ అని పేర్కొన్నారు.