మొంథా తుఫాన్‌..లోకేష్ సమీక్ష

6
- Advertisement -

మొంథా తుఫాను తీవ్రతపై ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షించారు మంత్రి నారా లోకేశ్. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు లోకేశ్. ఏ ప్రాంతంలో తుఫాను తీరం దాటుతుందో అధికారుల వద్ద ఆరా తీశారు.

నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు లోకేశ్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేశారు.

Also Read:రామ్ పోతినేని..సాంగ్ అప్‌డేట్

- Advertisement -