బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు.. కాకినాడకు 280కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 340 కిలో మీటర్లు దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేయగా మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
కాకినాడ తీరం దిశగా దూసుకొస్తుండటంతో ముందు జాగ్రత్తగా జిల్లాలో మూడు హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో తుఫాను ప్రభావిత మండలాలు 12, గ్రామాలు 67, మున్సిపాలిటీలు 5 ఉండగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. కాకినాడ నుండి విజయవాడకు 12, విశాఖపట్నంకు 8 బస్సు సర్వీసులు రద్దు చేశారు.
తీవ్ర తుపానుగా మారిన మొంథా సైక్లోన్ ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో 110 కిలో మీటర్ల వేగంతో.. మిగిలిన ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read:ప్రపంచంలోనే మొదటి స్కై స్టేడియం

