సత్యనారాయణరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి

7
- Advertisement -

వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో సత్యనారాయణరావు పార్దివ దేహానికి కేసీఆర్ నివాళి అర్పించారు. భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. హరీష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అలాగే సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేసీఆర్ సతీమణి శోభమ్మ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి…సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తండ్రి సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు మాజీ సీఎం వైఎస్ జగన్.

Also Read:కాకినాడ పోర్టు..గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌

- Advertisement -