- Advertisement -
ఆపదలో ఉన్నాం ఆదుకోండంటూ వైసీపీ శ్రేణుల పోస్ట్ కు స్పందించిచారు మంత్రి నారా లోకేష్. జగన్ కోసం అనే అకౌంట్ నుంచి జగన్ ఫోటోతో ఉన్న పోస్టును లోకేష్‍కు పెట్టారు వైసీపీ శ్రేణులు.
హేమలత అనారోగ్యం కారణంగా రూ.8 లక్షల వరకు వైద్యానికి ఖర్చు పెట్టారని పోస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియదని లోకేష్‍కు ట్యాగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. హేమలత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు లోకేష్. సమస్యను తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్… తన బృందం హేమలతను సంప్రదించి ఆదుకునేలా చూస్తుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

