తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.25,661 కోట్లతో రహదారి నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదు హైవేలకు చోటు దక్కింది.
రాష్ట్రవ్యాప్తంగా 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతివ్వగా హ్యామ్ విధానంలో కేంద్రం-ఎన్‌హెచ్ఏఐ నిధుల్లో 40:60 నిష్పత్తి ఉండనుంది. ఆర్మూర్ – జగిత్యాల రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ చేపట్టనున్నారు.
అలాగే జగిత్యాల-మంచిర్యాల హైవే విస్తరణకు రూ.2,550 కోట్ల మంజూరు కాగా జగిత్యాల-కరీంనగర్ రహదారికి రూ. 2,384 కోట్లు కేటాయించారు. అర్మూర్-జగిత్యాల రహదారి నిర్మాణానికి రూ.2,338 కోట్లు ఆమోదం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు రూ.15,627 కోట్ల నిధులను కేటాయించారు. హబూబ్‌నగర్ – రాయచూర్ రహదారి ఫోర్ లేన్‌గా విస్తరణకు రూ.2,662 కోట్లు ఇచ్చింది కేంద్రం.
Also Read:వైసీపీ నేతల పోస్ట్‌కు నారా లోకేష్

