ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

15
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు అందించనున్నట్లు ప్రకటించారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్.

గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు ఈ గుర్తింపు లభించినట్లు తెలిపారు.

ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదటి దశ శాంతి ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ట్రంప్ కృషి చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది హమాస్.

Also Read:విదేశాల్లో #RT76!

- Advertisement -