వర్సిటీల ర్యాంకింగ్స్ మెరుగుపరుస్తాం: లోకేష్

0
- Advertisement -

వచ్చే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెరిగేలా పని చేస్తున్నాం అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో మాట్లాడిన లోకేష్…టెక్నాలజీతో పాటు విజన్ కూడా ఎంతో ముఖ్యం అన్నారు. అప్పుడే లక్ష్యాలను సాధించగలం అని..విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం అన్నారు.

టైం అండ్ డేట్ రాసుకోండి, ఇది సాధించి ఈ దేశం ముందు నిలబడతాం అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్న తీరుని ప్రశంసించారు టెక్ మహీంద్రా మాజీ సీఈఓ C.P.గుర్నానీ. ఐటి మంత్రి నారా లోకేష్ పని తీరుని మెచ్చుకున్నారు.

Also Read:పుష్ప-2 ..రీలోడెడ్‌ వెర్షన్

- Advertisement -