నన్ను చంపేసి ఉండేవారు, కానీ..రాహుల్‌

23
- Advertisement -

భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు ఓ చేదు సంఘటన ఎదురైన విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఐదు నెలల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసిన రాహుల్‌కు జరిగిన సంఘటనను వివరించారు.

ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని…అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది నాకు చెప్పారు. కానీ నేను మా పార్టీవాళ్లతో మాట్లాడి…యాత్రలో ముందుకెళ్లేందుకే నిశ్చయించుకున్నా అలా నడుస్తున్నప్పుడు..ఒకసారి ఓ గుర్తుతెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు నిజంగానే జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?అని అడిగారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ వ్యక్తి..కాస్త దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ వాళ్లంతా ఉగ్రవాదులు అని చెప్పారు. ఆసమయంలో నేను నిజంగానే సమస్యల్లో ఉన్నానేమోనని అన్పించింది. ఎందుకంటే అలాంటి పరిస్థుల్లో ఆ ముష్కరులు నన్ను చంపేసేవారని కానీ అలా చేయలేదని…దీన్ని లిజనింగ్‌ శక్తి అంటారని రాహుల్‌ అన్నారు. గతేడాది సెప్టెంబర్‌7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పొత్తు.. ఆ పార్టీలతోనేనా?

కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -