భారీ రేటుకు ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్..

66
- Advertisement -

ప్రస్తుతం తెలుగులో నాని నటిస్తోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా భారీ అంచనాలున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో ఇలాంటి నేపథ్యంలో మొదటిసారిగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ విభిన్న నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కథ మీదున్న నమ్మకంతో నిర్మాత వెంకట బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఖర్చులో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన ప్రతీ ఒక్కటి సమకూర్చారు. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

పాన్ సౌత్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ”శ్యామ్ సింగ రాయ్” చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – దసరా సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మంచి రేటు పలికినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సౌత్ మ్యూజిక్ రైట్స్ ని పాపులర్ ఆడియో లేబుల్ కంపెనీ సరిగమ వారు దక్కించుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఆల్బమ్ ఆడియో రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు సరిగమ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -