టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి- మంత్రి కేటీఆర్‌

39
ktr

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలంగాణభవన్‌లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఇవాళ మానకొండూర్‌, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. విజయ గర్జన సభకు భారీగా జనసమీకరణ చేయాలని టీఆర్ఎస్‌ నేతలను కేటీఆర్ ఆదేశించారు. నియోజక వర్గాల్లో నాయకుల మధ్య గ్యాప్, కింది స్థాయి నాయకత్వ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆరా తీస్తున్నారు. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా వచ్చి కలవొచ్చని సూచించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ పార్టీ కోసం హార్డ్ వర్క్ చేయాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ సభకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.మనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. మళ్లీ గెలుస్తామంటూ కేటీఆర్ నేతలకు చెబుతున్నారు. ఇప్పటికే అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామని..ఇంకా చేయాల్సి ఉంది, అదీ చేద్దామంటూ భరోసా ఇస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం హార్డ్‌వర్క్‌ చేయాలని.. వరంగల్‌ సభకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కేటీఆర్‌ నేతలకు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్‌, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.