‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

198
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్‌లో ఈ సినిమా తొలి రోజున 1.6 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టింది.

తొలిరోజు ఏపీ, తెలంగాణలోనే 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని చాలా మంచి వసూళ్లు తీసుకొచ్చింది శ్యామ్ సింగరాయ్. టాక్ బాగానే ఉండటంతో కచ్చితంగా వీకెండ్ బాగా పర్ఫార్మ్ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు 22 కోట్ల బిజినెస్ జరిగింది.

70వ దశకంలో కలకత్తాలోని దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా సాగే కథ ఇది. ఆ దురాచారాన్ని ప్రశ్నించే కథానాయకుడిగా ‘శ్యామ్ సింగ రాయ్’ కనిపిస్తాడు. ఆ దేవదాసీ పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుంది. ఈ ఇద్దరి లుక్స్ కూడా బెంగాలీ ప్రాంతానికి చెందినవిగానే ఉంటాయి. ఇటు నాని లుక్ .. అటు సాయిపల్లవి లుక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -