శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన నాని వైఫ్‌..

194
- Advertisement -

ఇటివ‌లి కాలంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తు దుమారం రేపుతోంది. ఇక గత కొంత కాలంగా శ్రీరెడ్డి నానిపై ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే నానిగాడి రాస‌లీల‌లు బ‌య‌ట‌పెడ‌తానంటూ త‌న ఫేస్ బుక్‌లో తెలిపింది.

Sri Reddy

కొన్ని సందర్భాల్లో రాయడానికి కూడా వీల్లేని భాషను ఉపయోగిస్తూ, నానిపై విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపించాడు. దీనికి ప్రతిస్పందనగా… తాను కూడా చట్టపరంగానే పోరాటం చేస్తానంటూ శ్రీరెడ్డి తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై నాని భార్య అంజన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది. కానీ పబ్లిసిటీ కోసం వేరొకరి జీవితాలతో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడూ అందులోకి వస్తుండడం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవరూ పట్టించుకోరనుకోండి. కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి వారు ఎలా సిద్ధపడతారో’ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -