అమెజాన్ ప్రైమ్‌లో టక్‌ జగదీష్‌..

143
tuck jagadish

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ట‌క్‌…జ‌గ‌దీష్‌. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. నిన్నుకోరి వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా థియేట‌ర్‌లో విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు భావించారు. కానీ ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫ‌ర్ రావ‌డంతో నిర్మాత‌లు అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10 అర్ధ రాత్రి 12 గంటలకి ట‌క్ జ‌గ‌దీష్‌ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. ఓటీటీ విడుదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు తెలుస్తోంది.