పాండ్యా వాచ్ ఖరీదెంతో తెలుసా…?

190
hardik
- Advertisement -

టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య కాస్త రిలాక్స్ టైం దొరికితే చాలు విలాసవంతంగా జీవించేందుకు ఇష్టపడతాడు. తన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.

ఇక ఖరీదైన వస్తువులను ఇష్టపడే హార్ధిక్…తాజాగా ఓ బ్రాండెడ్ వస్తువును కొనుగోలు చేశారు. దాని ధర తెలిస్తే షాకవుతారు. ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 అనే బ్రాండెడ్‌ వాచ్‌ను కొనుగోలు చేశాడు. ఈ వాచీ డయల్ చుట్టూ అత్యంత అరుదైన 32 పచ్చ మరకత రాళ్లను అమర్చారు. వాచ్ మొత్తం ప్లాటినంతో తయారైంది. దీని ధర రూ.5 కోట్ల పైమాటే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీల్లో ఇదొకటి. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని హార్ధిక​ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హార్ధిక్ పాండ్యా. సెకండ్ ఎడిషన్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభంకానుండగా ఆగస్టు13నే అబుదాబికి చేరుకుంది ముంబై ఇండియన్స్.

- Advertisement -