‘తమ్ముడు’ గా నాని ?

55
- Advertisement -

కాంబినేషన్స్ సెట్ చేసుకోవడంలో అగ్ర నిర్మాత దిల్ రాజు దిట్ట. కథ ఫైనల్ అయిన వెంటనే యాప్ట్ అయ్యే హీరో ముందు వాలిపోతాడు. అయితే తాజాగా వేణు శ్రీరామ్ దిల్ రాజు కి ఓ కథ వినిపించాడట. అక్క తమ్ముడి కథతో సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్న ఈ కథ వినగానే నాని ముందు వాలి ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడట దిల్ రాజు.

గతంలో వేణు శ్రీరామ్ తో నాని ‘ఎం సీఏ’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. సెకండాఫ్ తేడా కొట్టినా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబోలో ఈ సినిమా రాబోతుందని సమాచారం.

నానికి అక్క గా భూమిక నటించనుందని తెలుస్తుంది. ‘ఎం సీ ఏ’ లో నాని వదినగా కనిపించింది భూమిక. ఇప్పుడు ఆమెతో అక్క పాత్ర వేయించాలని దిల్ రాజు వేణు శ్రీరామ్ భావిస్తున్నారట. ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేసుకొని రిజిస్టర్ చేయించారని సమాచారం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -