నాని, నేను లోకల్ ట్రైలర్‌..

536
Nani
- Advertisement -

2016లో నాలుగు సూపర్ హిట్లు నాని..ఈ ఏడాది కూడా అదే జోరుగా కొనసాగించడానికి నేను లోకల్ సినిమాను ముస్తాబు చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన నాని..సంక్రాంతి సందర్బంగా ట్రైలర్‌ ను రిలీజ్ చేశాడు. ఈ ప్రచార చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాచురల్ స్టార్‌ మంచి నాని..ఈసినిమాలో కూడా తనదైన నటనలో మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘ఒక అమ్మాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటోందంటే.. అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్‌ అని అర్థం. ద రిలేషన్‌ షిప్‌ బిట్విన్‌ మార్చి అండ్‌ సెప్టెంబర్‌ షుడ్‌ బి లైక్‌ ఎ ఫిష్‌’’ అంటూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు.

Nani

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నానికి జంటగా కీర్తిసురేశ్‌ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి నాని చిత్రానికి స్వరాలు సమకూర్చారు. క్లాస్ తో పాటు మాస్‌ లను కూడా బాగానే పేల్చాడు నాని. ‘పరిగెత్తి.. పరిగెత్తి బతికేదానిని జింకా అంటారు. ఆగి.. ఆగి.. కొట్టేదాన్ని పులి అంటారు’ అంటూ నాని చెప్పి మరో డైలాగ్‌ వింటుంటే యాక్షన్‌ సన్నివేశాలకూ మంచి ప్రాధాన్యమిచ్చినట్లు అర్థమవుతోంది.

- Advertisement -