నేను క్షేమంగానే ఉన్నా…

277
Nani Injured in Road Accident
- Advertisement -

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శుక్రవారం ఉదయం ప్రముఖ నటుడు నాని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన నాని తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. భయపడాల్సిన పని లేదని…అభిమానులు ఆందోళన చెందవద్దని, తనకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని పేర్కొన్నాడు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపాడు.

శుక్రవారం ఉదయం నాని షూటింగ్ ముగించుకుని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45 మీదుగా గచ్చిబౌలి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాని డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మద్యం సేవించలేదని తేల్చిన పోలీసులు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nani Injured in Road Accident

- Advertisement -