తెలంగాణ యాసలో నాని డైలాగ్ అదిరింది..

152
- Advertisement -

నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇది వరకు ఎన్నడూ చూడనిది. ఈ దసరా సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో నాని అందరినీ ఆశ్చర్యపరిచారు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన మహానటి కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దసరా సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం, కాన్సెప్ట్‌ను ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇందులో నాని, కీర్తి సురేష్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ఒకప్పటి కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాట ఇలా అన్నింటిని చూస్తుంటే ఇది పక్కా తెలంగాణ భాష, యాసలో తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

ఈ చిత్రం గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరినా వాహబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు.నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్వయహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దసరా యూనిట్‌కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

నటీనటులు : నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
కెమెరామెన్ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
సంగీతం : సంతోష్ నారాయణన్
ఎడిటర్ : నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ చాగంటి
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -