ఈటలపై మంత్రి హరీష్‌ ఫైర్..

59

టీఆర్‌ఎస్‌పై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని అన్నారు. ఈటలను బీజేపీ ఓన్‌ చేసుకోవడం లేదన్నారు. పెట్రో, గ్యాస్‌ ధరలు ఎందుకు పెరిగాయో ఈటల చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతోందన్నారు. దీన్ని ఈటల సమర్థిస్తారో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తారా? అని మంత్రి మండిపడ్డారు.