న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.
కుమారుడు, భార్యతో కలిసి ఆనందంగా గడిపాడు నాని. ఒక రెస్టారెంట్‌లో తనయుడిని ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుండగా, ఆ సన్నివేశాలని తన మొబైల్‌లో చిత్రీకరించింది నాని భార్య అంజన. క్రికెట్, బిర్యానీ, డ్యాన్స్, కౌగిలింత.. 20 రోజుల తర్వాత నాన్నతో జున్ను అని క్యాప్షన్ ఇచ్చింది. 20 రోజుల తర్వాత నాని మళ్ళీ తన కుమారుడిని చూసే సరికి పట్టలేని ఆనందంతో ఇలా గంతులేశారు.
జెర్సీ చిత్రంలో నాని .. అర్జున్ పాత్రలో కనిపించి అలరించారు. తనయుడిని ఎంతగానో ఇష్టపడే నాని అప్పుడప్పుడు జున్నుతో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.