నాని తండ్రయ్యాడు..

207
Nani blessed with a baby boy...

టాలీవుడ్‌ హీరో నాని ఇంట్లో ఈ రోజు రెండు పండుగలు. మామూలుగా ఈరోజు అందరి ఇళ్లల్లోనూ ఒకటే పండుగ. అదే తెలుగు సంవత్సరాది ఉగాది. అయితే ఉగాది పర్వదినాన్నే నాని భార్య అంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అందుకే ఇప్పుడు నాని ఇళ్ళు రెండు పండగలతో కళకళలాడుతోంది. నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారని పీఆర్వో మహేష్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తెలుపుతూ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

Nani blessed with a baby boy...

బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంజన మగ శిశువుకు జన్మనిచ్చారట. 2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఇటీవల తన తర్వాతి చిత్రం షూటింగ్‌ కోసం విదేశానికి వెళ్లి కొద్దిరోజుల క్రితమే తిరిగివచ్చారు.

కాగా, ఇప్పడు డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సినిమాల్లో దూసుకుపోతున్న నానికి ఇంతకంటే మంచి గ్రేట్‌ న్యూస్ ఏముంటుంది. అందుకే ఇప్పుడు నాని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మరి తండ్రి అయిన నానికి మనమూ శుభాకాంక్షలు చెబుదాం.!