తెలుగునాట మరో కొత్త ఆడియో కంపెనీ…

149

తెలుగు సినిమాలకు సంబంధించి ఆడియో కంపెనీలు ఉన్నట్టుగా ఇండిపెండెంట్ మ్యూజిక్ కి గాను కొత్త ఆడియో కంపనీ వెలసింది. ఉగాది సందర్భంగా దర్శకేంద్రులు కే రాఘవేంద్ర చేతుల మీదుగా “ఇండీ విండ్స్ రికార్డ్స్” పేరుతో ప్రారింభమైన ఈ ఆడియో కంపెనీకి ప్రముఖ ఫ్లూటిస్ట్, ఆదిశంకర వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఫ్లూట్ నాగరాజ్ (నాగ్ శ్రీవత్స) వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తుండగా మణి నాగరాజ్, లలిత్ తాళ్లూరి కార్యనిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు.

  Indie Winds Records Launch

ఇండీ విండ్స్ రికార్డ్స్ వ్యవస్థాపకులు ఫ్లూట్ నాగరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మన దేశంలో సినిమా సంగీతానికి ఉన్నంత ప్రాధాన్యం ఇండిపెండెంట్ మ్యూజిక్ కి లేకపోవడానికి కారణం సరైన వేదిక లేకపోవడమే. మా స్వీయసంగీతంతో పాటు ఔత్సాహిక యువకళాకారుల సంగీతానికి కూడా ఒక వేదికను కలిపించాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన సంస్థ ఇది. దర్శక దిగ్గజం కే రాఘవేంద్రరావుగారు మాకు శ్రేయోభిలాషి, గురువు, మిత్రులు. వారి చేతుల మీదుగా మా కంపెనీ లోగో ఆవిష్కారం కావడం శుభసూచికంగా భావిస్తున్నాం”, అన్నారు.

“ఏప్రిల్ 15 న ఢిల్లీలో మా ఇండీ విండ్స్ పై మా తొలి ఆల్బం “త్రివేణు” ఆవిష్కృతమౌతోంది. నాతో పాటూ హిందూస్తాని వేణుగాన విద్వాంసులు రూపక్ కులకర్ణి, పాశ్చాత్య వేణు విద్వాంసులు హెన్రీ టర్నియర్లు కలిసి నిర్వహిస్తున్న ఈ “త్రివేణు” ఫ్యూజన్ సంగీతంలో ఒక కొత్త అధ్యాయం”, అని ప్రకటించారు నాగరాజ్.