నాని నిర్మాతగా రెండో సినిమా..!

359
actor nani
- Advertisement -

ఓ వైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాచురల్ స్టార్ నాని మరోవైపు నిర్మాణ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018లో నాని నిర్మాతగా అ! సినిమాను తెరకెక్కించారు. థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల జెర్సీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి నిర్మాతగా సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు.

స్వప్న మూవీస్‌ తో కలిసి నాని ఈ సినిమాను నిర్మిస్తుండగా పక్కా కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి అనుదీప్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి ఈ సినిమా వెళ్లనుండగా నవీన్, ప్రియదర్శన్, రాహుల్ రామకృష్ణ, షాలిని పాండేలు నటిస్తున్నారు. రీసెంట్ గా ‘జెర్సీ’ సినిమాతో హిట్ కొట్టిన నాని, నిర్మాతగా తాజా ప్రాజెక్టుతోను హిట్ కొడతాడేమో చూడాలి.

- Advertisement -