టీఆర్ఎస్ కు 4 కేంద్రమంత్రి పదవులు..?మంత్రులు కానున్నది వీరే!!!

267
kcr
- Advertisement -

ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పేరు మారుమోగేలా..కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా ..అదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేసేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు…అంతా ఊహిస్తున్నట్లు కేంద్రంలో గనుక హంగ్ వస్తే టీఆర్ఎస్ పంట పండినట్లే…రెండు క్యాబినెట్ మంత్రి పదవులు..రెండు సహాయ మంత్రి పదవులు తీసుకునేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు.

అదే జరిగితే కల్వకుంట్ల కవిత, ఎంపీ వినోద్ ఇద్దరూ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.. ఈమేరకు ఎంపీ వినోద్ కు మంత్రి పదవి ఖాయం అని ప్రచార సమయంలోనే కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు..

తెలంగాణను తెచ్చిన పార్టీగా..గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వంగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న టీఆర్ఎస్ తాను అమలు చేసిన సంక్షేమ పథకాల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది..అందుకే నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ అలయన్స్ ఒకటి తయారుచేస్తోంది.

ఫెడరల్ ఫ్రంట్ గా కేంద్రంలో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.. 2014లో 11 ఎంపీలను గెలుచుకున్న కేసీఆర్ ఈసారి కచ్చితంగా 16 గెలుచుకుంటాననే ధీమాలో ఉన్నారు.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో అంతా విస్తుపోయేలా దేశాన్ని ఎలా బాగు చేయొచ్చో…ఎన్ని టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయో చెబుతూ తన జాతీయతా వాదాన్ని ఘనంగా చాటారు కేసీఆర్..సో… అయితే ఫెడరల్ ఫ్రంట్…లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్టీయే అయినా యూపీఏ అయినా వారితో జతకట్టడం..ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ వ్యూహంగా రాజకీయ నిపుణులు చెబుతున్న మాట..

- Advertisement -