Nani:’hi నాన్న’

58
- Advertisement -

దసరా హిట్ తర్వాత ఫుల్ జోష్ మీదున్నారు నేచురల్ స్టార్ నాని. తన తర్వాతి సినిమాను శౌర్యువ్ దర్శకత్వంలో చేయనుండగా నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఇవాళ సినిమా టైటిల్‌ని రిలీజ్ చేశారు.

నాని కెరీర్‌లో ఇది 30వ సినిమా. ఈ సినిమాకు‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ప్రకటించారు. అలాగే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీ అని, సినిమాలో నాని భార్య చనిపోవడంతో పాపతో జీవిస్తూ ఉంటే మృణాల్ తన లైఫ్ లోకి పాప ద్వారా వస్తుంది అని అర్ధమవుతుంది.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మించిన ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం 5 భాషల్లో డిసెంబర్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కానుంది.

Also Read:మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు..!

- Advertisement -