నాని 29 @ దసరా

12
nani 29

వరుస సినిమాలతో రిలీజ్‌కు సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే చేతిలో పలు సినిమాలు ఉండగా దసరా కానుకగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్‌చేశారు నాని. ఇది నానికి 29వ సినిమా కాగా దసరా కానుకగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు నాని వెల్లడించారు.

అక్టోబర్ 15న మధ్యాహ్నం 1:53 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి నాని ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ పోస్టర్‌లో గూడ్స్ రైలు పొగలు కక్కుతూ వెళ్తున్నట్టు కన్పిస్తోంది. పోస్టర్ డిజైన్ దాని రంగు, ఫాంట్‌ సరికొత్తగా ఉండడంతో కథ ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డారు నెటిజన్లు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది. నాని ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తి చేసి, ‘అంటే సుందరానికి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.