మంత్రి గంగులకు కరోనా..

13

మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ వచ్చింది. కాగా, మంత్రి గంగుల కరోనా బారినపడటం ఇది రెండోసారి. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. గత కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.