ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకూ ముదిరి పాకన పడుతోంది. నంది అవార్డుల్లో కమ్మ వాసన కొడుతోందని పలువురు బహిరంగంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక లేట్‌గానైనా లెటెస్ట్‌గా స్పందించారు వర్మ. నంది అవార్డుల కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటూ సెటైర్లు విసిరిన వర్మ..మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్లు చేశాడు.
తాజాగా నంది అవార్డులపై ఏకంగా ఒక పాటనే విడుదల చేశారు. ‘ఒకటా.. రెండా.. తొమ్మిదీ..’ అంటూ ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాలోని పాట విజువల్స్ కు.. నంది అవార్డులపై వ్యంగ్యంగా రూపొందించిన పాటను జత చేసి పోస్ట్ చేశారు. ‘ఇష్టమొచ్చినట్లు పంచుకోవడం మాకు ఇష్టం… మేము చెప్పినట్లు తల ఊపూ నందీ.. ఇంకెందుకు నందులు.. ఎందుకో?.. అంకెలు చూస్తే తొమ్మిది మా కోరిక మాత్రం కమ్మది’ అంటూ నంది అవార్డులపై భారీ సెటైర్లు వేశారు వర్మ.
‘గంగిరెద్దులాగ నన్ను చూడకండి.. అక్కడక్కడే తిప్పకండి’ అంటూ ‘నంది’ పాట పాడుతుందని ఆయన వివరించారు. ఈ వీడియోని మీరూ చూడండి…