శర్వానంద్ చేతికి.. నాని సినిమా!

335
Sharwanand okays Hanu’s script
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్‌ రేటును అంతకంతకూ పెంచుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్.శతమానం భవతి , మహానుభావుడు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న శర్వా ప్రస్తుతం స్వామిరారా, దోచేయ్, కేశవా చిత్రాలతో సక్సెస్ లు అందుకున్న సుధీర్ వర్మ తాజాగా శర్వానంద్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించే ఈ మూవీలో శర్వానంద్ మాఫియా లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీలో శర్వా సరసన నటించే  ఇద్దరు ముద్దు గుమ్మలను ఫైనల్ చేసినట్టు సమాచారం.

ఈ సినిమాతో పాటు ‘లై’ దర్శకుడు హను రాఘవపూడితో మరో మూవి చేస్తున్నాడు శర్వా. అయితే హను ఈ సినిమా స్క్రిప్ట్‌ను నాని కోసం తయారు చేసుకున్నాడు. కానీ నాని కొన్ని కారణాలతో ఆ సినిమా వదులుకున్నాడు. దీంతో శర్వాతో సినిమాను తెరకెక్కించేందుకు హను సిద్దమయ్యాడు.  శర్వాతో ‘ఫిదా’ పోరీ సాయి పల్లవి జత కట్టనున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో నేపాల్‌లో ప్రారంభం కానుంది.

ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. చిత్రం ఏమిటంటే శర్వా ఒప్పుకున్న ఈ రెండు చిత్రాల దర్శకుల గత సినిమాలు భారీ డిజస్టర్లు. హను ‘లై’, వర్మ ‘దోచేయ్’ సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మంచి ఫామ్‌లో ఉన్న శర్వా వీరిద్దరికీ అవకాశం ఇవ్వడం నిజంగా సాహసమేననేది ఇండస్ట్రీ టాక్.

- Advertisement -