నంద‌మూరి హీరో మ‌ల్టీస్టార‌ర్ లో నాగార్జున‌..

182
Kalyan-Ram,Nagarjuna

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప‌టాస్ సినిమాతో మ‌ళ్లి స‌క్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన త‌ర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ తో చేసిన ఇజం సినిమా కొంచెం వ‌ర‌కూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించినా బాక్సాఫిస్ వ‌ద్ద అంత‌గా మెప్పించ‌లేక‌పోయాడు. క‌ళ్యాణ్ రామ్ ఇటివ‌లే న‌టించిన నా నువ్వే సినిమా కూడా పెద్ద ప్లాప్ ను ఎదుర్కొంది. మ‌రో భారీ స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోన్నాడు ఈ నంద‌మూరి హీరో.

kalyanram

క‌ళ్యాణ్ రామ్ గురించి తాజాగా ఇండ‌స్ట్రీలో మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న బ్యాన‌ర్ లో ఒక మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈమూవీలో ఒక హీరోగా క‌ళ్యాణ్ రామ్..మ‌రో హీరోగా కింగ్ నాగార్జునను తీసుకొన్నున్నారు. ఈసంద‌ర్భంగా నాగార్జున‌కు క‌థ‌ను కూడా వినిపించార‌ని…అందుకు నాగార్జున కూడా ఓకే చెప్పేశార‌ని ఫిలీం న‌గ‌ర్లో కోడై కూస్తోంది. ఈసినిమాలో నాగార్జున పాత్ర హైలెట్ గా నిల‌వ‌నుంద‌ని తెల‌స్తోంది.

kalyanm ram, pawan sadineni

ఈ సినిమాకి పవన్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హంచనున్నాడు. ప్ర‌స్తుతం నాగార్జున నానితో క‌లిసి ఓ మ‌ల్టిస్టార‌ర్ సినిమాలో న‌టింస్తోన్నాడు. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇప్ప‌టికి స‌గం వ‌ర‌కూ ఈసినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. ఈసినిమా షూటింగ్ పూర్తికాగానే క‌ళ్యాణ్ రామ్ తో క‌లిసి మ‌ల్టిస్టార‌ర్ సినిమాలో చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు చిత్ర బృందం. అటు హీరోగా…ఇటు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు కింగ్ నాగార్జున‌.